Farming: మిరప పంటలో ఈ లక్షణాలు కనిపిస్తే.. జాగ్రత్త పడండి.. లేదంటే నష్టపోతారు!

by Phanindra |   (  Updated:2025-03-03 04:15:26  IST  )

తెలుగు రాష్ట్రాల్లో రైతులు మిరపను వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు.

Farming: మిరప పంటలో ఈ లక్షణాలు కనిపిస్తే.. జాగ్రత్త పడండి.. లేదంటే నష్టపోతారు!
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో రైతులు పచ్చిమిరపను ( Mirchi ) వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ పంట తక్కువ కాలంలోనే మంచి దిగుబడిని ఇస్తుందని మనందరికీ తెలిసిందే. అయితే, ఈ పంటకు ఆకు కర్ల్ వైరస్ పెద్ద ముప్పుగా చెబుతుంటారు. దీని వలన పంటకు తీవ్రమైన నష్టం కలుగుతుంది. కాబట్టి, వైరస్ సోకిన మొదట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పచ్చిమిరప పంటలో ఆకు కర్ల్ వైరస్ తీవ్రమైన వ్యాధిలాగా పరిగణిస్తారు. ఇది ఆకుల రంగును మార్చేస్తుంది. ఒకసారి ఈ వైరస్ సోకిన మొక్క వంకరగా మారుతుంది. ఇది మొక్క ఎదగకుండా చేస్తుంది. ఈ వైరస్ ప్రధానంగా తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ కీటకం వైరస్‌ను ఒక మొక్క నుండి మరో మొక్కకు వ్యాప్తి చెందేలా చేస్తుంది. దీని వలన పంట మొత్తం నాశనం అవుతుంది.

తెల్లదోమ నివారణకు చిట్కాలు

మిరప నారును నెట్ కింద పెంచాలి. ఈ సమయంలో నెట్‌ షేడ్లను వేయడం వలన తెల్లదోమ రాకుండా ఉంటుంది.

తెగులు సోకిన మొక్కలను తొలగించడం

మిరప మొక్కలకు తెగులు సోకినప్పుడు వాటిని వెంటనే తీసివేయాలి. అలాగే, ఆకు కర్ల్ వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే, ఆ మొక్కలను వేరుతో సహా తీసి వేయండి. ఇలా చేయడం వలన ఈ వైరస్ మిగతా మొక్కలకు కూడా వ్యాప్తి చెందకుండా ఉంటుంది.

రసాయనిక నివారణ పద్ధతులు

వైరస్ ఎంతకీ తగ్గకపోతే , రైతులు రసాయనిక పురుగుమందులు ఉపయోగించాలి. దీని వలన మొక్కలు ఎదుగుతాయి.

సేంద్రియ పద్ధతులు

రసాయనాలను వాడటం వలన మొక్కలు ఎదుగుతాయా ? లేదా అని సందేహం ఉన్నవారు సేంద్రియ పద్ధతులను అనుసరించవచ్చు.

వేపనూనె పిచికారీ

వేపనూనెను బాగా మరిగించి మొక్కలపై పిచికారీ చేస్తే తెల్లదోమ వ్యాప్తి చెందదు. ఇది మిరప పంటలకు సురక్షితమైన పద్ధతి.

Next Story