- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chamanthi Flower: పూల సాగుతో భారీ లాభాలు.. శ్రమ తక్కువ .. ఆదాయం ఎక్కువ
చామంతి రైతుల ఇంట సిరులను కురిపిస్తుంది

దిశ, వెబ్ డెస్క్ : రైతులు రక రకాల పంటలను పండిస్తారు. ప్రతి ఏడాది కొత్త రకం పంటను వేస్తారు. వాటిలో ఎక్కువగా పూల సాగును కూడా చేస్తారు. ఇది తక్కువ శ్రమతో అధిక లాభాలను తెచ్చి పెడుతుంది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ లో చామంతికి.. డిమాండ్ ఉంటుంది. అలాగే, ఎంతో మంది పూజ చేసేటప్పుడు ఈ పూలను వాడుతుంటారు. ఇలా .. ఏడాది పొడవునా అన్ని సీజన్లలో లభిస్తుంది. శీతాకాలంలో పూసే చామంతి.. రైతుల ఇంట సిరులను కురిపిస్తుంది.
తక్కువ పెట్టుబడి, అధిక లాభాలు పొందాలనుకొనే రైతులకు ‘చామంతి’ పంట సాగు బెస్ట్. వీటిని పూల మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది. అన్ని రకాల నేలల్లోనూ ఈ పూలను సాగు చేయోచ్చు. ఒండ్రు నేలల్లో అయితే అధిక దిగుబడి వస్తుంది. ముందుగా భూమిని మూడు నుంచి నాలుగు సార్లు ట్రాక్టర్ తో దున్నుకోవాలి. మొక్కలు నాటే ముందు.. ఎకరానికి 10 టన్నుల ఎరువు, 60 కిలోల నత్రజని ( natrajani) , 30 కిలోల భాస్వరం ( bhaswaram) , 60 కిలోల పొటాషియం ( potassium) వేసుకోవాలి. ఒక ఎకరం పొలంలో 55వేల నుంచి 60వేల మొక్కలను నాటుకోవచ్చు. ఈ పూల మొక్కలకు డ్రిప్ ద్వారా నీటిని అందించాలి. దీని వలన కలుపు మొక్కలు రాకుండా ఉంటాయి. మొక్కలు కింద పడకుండా ఉండటానికి వెదురు కర్రను సపోర్ట్ గా ఉంచాలి.
మొక్క దగ్గర మట్టిని రెండు మూడు సార్లు కదిలించడం వల్ల వేరు వ్యవస్థ బలంగా మారుతుంది. మొక్కలు నాటిన వారానికి రెండు నుంచి మూడు సార్లు నీరు పెట్టాలి. ఆ తర్వాత వారానికి ఒకసారి నీటిని అందివ్వాలి. అయితే, మొక్క దగ్గర ఎక్కువ నీరు ఉండకుండా చూసుకోవాలి. లేదంటే తెగులు వచ్చే అవకాశం ఉంది. 20 రోజులకోసారి మందులను పిచికారీ చేస్తూ ఉండాలి. దీని వలన మొక్కలు ఎదుగుతాయి. వీటిని పాటిస్తే ఎకరానికి ఎనిమిది నుంచి పది టన్నుల వరకూ పూల దిగుబడిని వస్తుంది. అంటే ఒక్కొ చామంతి మొక్క నుంచి 75 నుంచి 120 పూలను పొందవచ్చు.






