- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Cauliflower: క్యాలీఫ్లవర్ పంటను ఎలా సాగు చేయాలంటే..?
రైతులు క్యాలీఫ్లవర్ పంటతో డబ్బును బాగా సంపాదిస్తున్నారు

దిశ, వెబ్ డెస్క్ : ఒకప్పుడు రైతులు వరి, పత్తి , మిరప పండించే వాళ్ళు. కానీ, ఇప్పుడు కూరగాయల పంటలను పండించడానికి మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో వీటికి సరైన ధర ఉంటే.. అధిక లాభాలు వస్తాయి. ధువా గ్రామానికి చెందిన ఓ రైతు గత ఐదేళ్ళ నుంచి క్యాలీఫ్లవర్ పంటను వేస్తున్నారు.
కూరగాయలను వేస్తూ.. సాగు చేసి మంచి ఆదాయాన్ని కూడా పొందుతున్నాడు. రైతులలో కొందరు వ్యవసాయం వదిలి కూరగాయల పండించడానికే ఇష్ట పడుతున్నారు. ప్రస్తుతం, అతను తీగ టమోటాను కూడా పండిస్తున్నాడు. వేరుశనగ, బంగాళదుంప సాగు చేసిన దిగుబడి రాకపోవడంతో ఇతర కూరగాయల పంటల వైపు దృష్టి మళ్ళింది. ప్రస్తుతం, క్యాలీఫ్లవర్ పంటతో లక్షల్లో సంపాదిస్తున్నాడు.
గత పదేళ్ళలో వివిధ రకాల కూరగాయల పంటలను పండిస్తున్నాడు. వీటిలో టమాటా, బెండ, దూది, క్యాలీఫ్లవర్ ఉన్నాయి. వీటిని సాగు చేస్తూ ఆదాయం పొందుతున్నాడు. ఈ ఏడాది స్ప్రింక్లర్ విధానంలో క్యాలీఫ్లవర్ మొక్కలు నాటారు. దీనికి మొత్తం 16 వేల రూపాయలు ఖర్చు చేశారు. ప్రస్తుతం, ఈ పొలం పంట కోతకి వచ్చింది.
ఆ గ్రామానికి చెందిన రైతులు క్యాలీఫ్లవర్ పంటతో డబ్బును బాగా సంపాదిస్తున్నారు. సీజన్ సమయంలో ఒక్కో పువ్వు రూ. 30 కూడా అమ్ముతుంది. అలాగే, దీనికి మార్కెట్లో మంచి ధరలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం, క్యాలీఫ్లవర్ కిలో 70 నుండి 80 రూపాయల వరకు పలుకుతుంది. ఈ సీజన్ ముగిసే వరకు దాదాపు 3 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది.






