- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Banana: అరటి సాగు చేయాలంటే.. ఒక ఎకరా కి ఎంత పెట్టుబడి పెట్టాలి..?
ఒకసారి అరటిపంట వేస్తె మూడేళ్ళ వరకు వస్తుంది

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో అరటిని సాగు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో కడప, అనంతపురం, ఉభయగోదావరి, విజయనగరం, కృష్ణా జిల్లాలో అరటి పంటను పండిస్తారు. చక్కెర కేళి గ్రాండ్-9, ఎర్ర చక్కరకేళి, కర్పూర, అమృతపాణి, బుడిద చక్కెరకేళి, తేళ్ల చక్కెరకేళి, సుగంధ, రస్తోలి వంటి రకాలు సాగు చేస్తారు. ఇక తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలోని హున్సా, నల్గొండ జిల్లాలోని అన్నారెడ్డిగూడెం, కనగల్, చెర్లగౌరారం తదితర ప్రాంతాల్లో అరటి పంటను పండిస్తారు. ఒక ఎకరా కి ఎంత పెట్టుబడి పెట్టాలి..? ఎంత రాబడి వస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..
ఒక ఎకరా అరటి తోటను పండించడానికి రెండు లక్షల వరకు అవుతుంది. అదే నాలుగు ఎకరాలు సాగు చేయాలనుకుంటే అన్ని కలిపి ఆరు లక్షలు అవుతుంది. అరటి కేజీ 20 రూపాయలు వరకు అమ్ముడుపోతే భారీ లాభాలు వస్తాయి. రూ. 8, 4, 5 కి కేజీకి పోతే పెట్టుబడి కూడా రాదు, నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఆరేళ్ళుగా అరటి సాగు చేస్తున్న రైతులు " ఒకసారి లాభాలు వస్తే.. ఒకసారి నష్టాలు వస్తాయి" అని చెబుతున్నారు.
ఒకసారి అరటిపంట వేస్తె మూడేళ్ళ వరకు వస్తుంది. కానీ, ఇప్పుడు ఇది వరకు లాగా లేదు. రెండు ఏళ్ళలోనే మొత్తం పంటను తీసి వేస్తున్నారు. ఈ అరటి పంటలో పెట్టుబడి ఎక్కువ అవుతుంది. మొత్తం ఖర్చు రెండు లక్షలవుతుంది. దిగుబడి మంచిగా బాగా వస్తే పెట్టిన దానికి డబుల్ వస్తుంది.
అరటి పంట సాగు మొదటి నుంచి అయిపోయే వరకు ఎకరాకు దాదాపు లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టాలి. దిగుబడి మంచిగా ఉంటే ఎకరాకు 15 నుంచి 20 టన్నుల వరకు దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం ధర టన్ను రూ.15 వేల నుంచి వివిధ రకాల రూ.20 వేల వరకు పలుకుతుందని మార్కెట్ వ్యాపారులు చెబుతున్నారు.






