రైతులకు గుడ్‌న్యూస్.. జులై‌లో అకౌంట్‌లోకి పీఎం కిసాన్ డబ్బులు జమ!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-27 08:43:22  IST  )

కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం చేసేందుకు అనేక పథకాలు అమలు చేస్తోంది.

రైతులకు గుడ్‌న్యూస్.. జులై‌లో అకౌంట్‌లోకి పీఎం కిసాన్ డబ్బులు జమ!
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం చేసేందుకు అనేక పథకాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan Yojana)ను అమలుచేస్తోంది. ఈ పథకం ద్వారా రైతులకు (Farmers) పెట్టుబడి సాయంగా ఏటా రూ.6 వేలు అందిస్తోంది. ఇక ఈ మొత్తం మూడు విడతలుగా రూ.2,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. 2019లో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించగా.. ఇప్పటివరకు 19 విడతల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. ఇక జులై (July) నెలలో 20వ విడత నిధులు విడుదల అయ్యే అవకాశముంది. రైతులు పీఎం కిసాన్ యోజన ఆర్థిక సాయం పొందాలనుకుంటే.. e-KYC తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఇక దీనిపై ప్రభుత్వం త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేసి, తేదీని స్పష్టం చేసే అవకాశం ఉంది.

ఈ-కేవైసీ ఎలా పూర్తి చేయాలంటే?

* ముందుగా అధికారిక పోర్టల్ https://pmkisan.gov.in ను ఓపెన్ చేయాలి.

* e-KYC ఆప్షన్ పై క్లిక్ చేయండి.

* ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి.

* ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌కు పంపబడిన OTPని సరిగ్గా నమోదు చేయాలి.

* OTP ధృవీకరణ విజయవంతం అయిన తర్వాత e-KYC పూర్తవుతుంది.

డ‌బ్బు ఖాతాలో జ‌మ‌య్యిందా? లేదా? తెలుసుకోండిలా..

* https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి.

* కుడి వైపున క‌నిపిస్తున్న ఆప్ష‌న్ల‌లో బెనిఫిషియ‌రీ స్టేట‌స్ ఆప్ష‌న్ సెలక్ట్ చేసుకోవాలి.

* త‌ర్వాత ఆధార్ లేదా ఖాతా నెంబ‌రును ఎంట‌ర్ చేసి గెట్ డేటా పై క్లిక్ చేయాలి.

* స్టేట‌స్ స్క్రీన్‌పై క‌నిపిస్తుంది.

* ఈ-కేవైసీ పూర్తి చేసి ఉంటేనే ఖాతాలోకి డ‌బ్బు జ‌మ‌వుతుంది.

* అలాగే ల‌బ్ధిదారుల జాబితాలో పేరు ఉందో.. లేదో.. కూడా చెక్ చేసుకోవ‌చ్చు.

* బెనిఫిషియ‌రీ స్టేట‌స్ కింద బెనిఫిషియ‌రీ లిస్ట్ ఆప్ష‌న్ క‌నిపిస్తుంది.

* ఈ ఆప్ష‌న్‌పై క్లిక్ చేస్తే మ‌రొక పేజీకి రీడైరెక్ట్ అవుతుంది.

* ఇక్క‌డ ల‌బ్ధిదారుని రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామాల‌ను ఎంచుకుని గెట్ రిపోర్ట్‌పై క్లిక్ చేస్తే ల‌బ్ధిదారుల జాబితా క‌నిపిస్తుంది.

Next Story