- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PM Kisan Maandhan Yojana: ప్రతి నెలా రైతులకు రూ. 3000 పెన్షన్.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
చిన్న, సన్నకారు రైతులను ఆర్ధికంగా ఆదుకోవడమే దీని లక్ష్యం.

దిశ, వెబ్ డెస్క్ : రైతులు వేసిన పంటలకు ఒక్కోసారి గిట్టుబాటు ధర కూడా రాదు. ఈ క్రమంలోనే వారి కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. వీటి వలన రైతులకు ఎంతో కొంతో ప్రయోజనం చేకూరుతుంది. వాటిలో ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకం కూడా ఒకటి. 60 ఏళ్లు నిండిన తర్వాత ఈ పథకం కింద రైతులకు ప్రతి నెలా రూ. 3000 పింఛను ఇస్తారు. అయితే, ఎలా అప్లై ఎలా చేసుకోవాలో ఇక్కడ చూద్దాం..
రైతులు కష్టపడి పండించిన బియ్యాన్ని అందరూ ఆహారంగా తీసుకుంటున్నారు. వారు పంటలు వేయడం మానేస్తే తినడానికి కూడా మెతుకు కూడా దొరకదు. మరి, అలాంటి రైతులు వృద్ధులు అయ్యాక వారికి సాయం అందించాలని 2019లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. చిన్న, సన్నకారు రైతులను ఆర్ధికంగా ఆదుకోవడమే దీని లక్ష్యం.
ఎవరు అర్హులు?
పంటను సాగు చేస్తున్న రైతులందరూ ఈ పథకానికి అర్హులవుతారు. అయితే, 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్న రైతన్నలు అప్లై చేసుకోవచ్చు. వయసు అయిపోయి పంటలు వేయాలని రైతులను ఈ పథకం ఆదుకుంటుంది. 60 ఏళ్లు నిండిన వారికీ ప్రతి నెలా రూ.3000 పింఛను పొందుతారు. ఒకవేళ వ్యవసాయం చేసే రైతు మరణిస్తే అతని భార్యకు నెలకు రూ.1500 పింఛన్ అందేజేస్తారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఇలా సులభంగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోండి. అధికారిక వెబ్‌సైట్ www.pmkmy.gov.in లో ద్వారా అప్లై చేసుకోవాలి. వెబ్‌సైట్ లాగిన్ అయిన తర్వాత, అక్కడున్న వాటిని పూరించాల్సి ఉంటుంది. తప్పుగా నమోదు చేస్తే రిజక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి, మీ వివరాలను ఒకటికి, రెండు సార్లు చూసుకుని ఎంటర్ చేయండి. ఫారమ్ ఫిల్ చేశాక , Generate OTPపై క్లిక్ చేసి, OTPని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేస్తే దరఖాస్తు ప్రక్రియను పూర్తవుతుంది.






