చెన్నైలో మళ్లీ లాక్‌డౌన్

by Shamantha N |

<p>చెన్నై: కరోనా కేసులు భారీగా నమోదవుతున్న తమిళనాడు రాజధాని చెన్నైలో మరోసారి లాక్‌డౌన్ విధించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఈ సారి చెన్నై, దాని పరిసర ప్రాంతాలతోపాటు తిరువళ్లూర్, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లోని ఏరియాల్లోనూ కఠిన నిబంధనలతో లాక్‌డౌన్ అమలు చేయనున్నట్టు వెల్లడించింది. జూన్ 19 నుంచి 30వ తేదీ వరకు ఈ లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నట్టు తెలిపింది. కాగా, ఈ వ్యవధిలో వచ్చే రెండు ఆదివారాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ ఉంటుందని పేర్కొంది. మిగతా రోజుల్లో [&hellip;]</p>

చెన్నైలో మళ్లీ లాక్‌డౌన్
X

చెన్నై: కరోనా కేసులు భారీగా నమోదవుతున్న తమిళనాడు రాజధాని చెన్నైలో మరోసారి లాక్‌డౌన్ విధించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఈ సారి చెన్నై, దాని పరిసర ప్రాంతాలతోపాటు తిరువళ్లూర్, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లోని ఏరియాల్లోనూ కఠిన నిబంధనలతో లాక్‌డౌన్ అమలు చేయనున్నట్టు వెల్లడించింది.

జూన్ 19 నుంచి 30వ తేదీ వరకు ఈ లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నట్టు తెలిపింది. కాగా, ఈ వ్యవధిలో వచ్చే రెండు ఆదివారాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ ఉంటుందని పేర్కొంది. మిగతా రోజుల్లో హాస్పిటళ్లు, ల్యాబ్‌లు, ఫార్మసీలకు మాత్రమే అనుమతి ఉంటుంది.

అత్యవసర సేవలకు తప్పితే ట్యాక్సీలు, ఆటోలకూ అనుమతి లేదు. నిత్యావసర సరుకుల కోసం ప్రజలు రెండు కిలోమీటర్ల పరిధి దాటి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 29,30వ తేదీల్లో మాత్రమే 33శాతం మంది సిబ్బందితో బ్యాంకులు సేవలందిస్తాయి.

Next Story