కాంగ్రెస్ పార్టీలో షోకాజ్ నోటీసుల కలకలం.. ఆయన పదవికి గండమేనా..?

by  |
Congress party
X

దిశ, మణుగూరు : ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్, వైఎస్ఆర్ సీపీ ఎంట్రీతో బీటలు బారింది. ముఖ్య నాయకులు, అనుచరగణం నచ్చిన పార్టీలోకి జంప్ అయ్యారు. ఇక మిగిలిన నాయకులు పార్టీని నెట్టుకొస్తుండగా.. కొందరు నాయకులు మాత్రం పార్టీ పేరుతో దందాలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పటిష్టకు కృషి చేయకుండా సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. వీటిల్లో ప్రధానంగా పినపాక మండల అధ్యక్షుడి పేరు ఉన్నట్లు సమాచారం.

ఇటీవల కాంగ్రెస్ పినపాక నియోజకవర్గ కన్వీనర్ చందా సంతోష్ కుమార్ మణుగూరులో పార్టీ ముఖ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పినపాక మండల అధ్యక్షుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడని, పార్టీ బలోపేతం కోసం పనిచేయడంలేదని, నిత్యం దందాలకే పరిమితం అవుతున్నాడనే ఆరోపణలు రావడంతో ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అసంతృప్తి చెందిన ఆయన పార్టీ మారేందుకు సిద్ధపడినట్లు సమాచారం. ఏళ్లుగా పార్టీని నమ్ముకొని పని చేస్తోన్న తనను అవమానించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కార్యకర్తలు పేర్కొంటున్నారు.

మండల అధ్యక్షుడి రేసులో అచ్చ నవీన్…?

కాగా, ఇప్పుడున్న మండల అధ్యక్షుడిని తొలగిస్తారనే ప్రచారం పార్టీలో జోరందుకోవడంతో నూతన అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు పలువురు నాయకులు రేసులోకి వస్తున్నారు. ఇందులో ప్రధానంగా వినిపిస్తోన్న పేరు అచ్చ నవీన్. పార్టీ కార్యక్రమాల్లో, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నవీన్‌ను పార్టీ అధ్యక్షుడిగా చేస్తే మండలంలో కాంగ్రెస్ బలపడుతుందని సీనియర్లు సైతం భావిస్తోన్నట్లు సమాచారం. మరి పాత అధ్యక్షుడిని మారుస్తారా.. లేక అచ్చ నవీన్‌ను ఆ సీట్లో కూర్చోబెడతారా.. డీసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.. !


Next Story

Most Viewed