నాలుగేళ్ల విరహ వేదన.. ప్రియుడికి హగ్, ముద్దులు ఇచ్చి తుపాకీతో కాల్చిన గర్ల్ ఫ్రెండ్..!

by  |
నాలుగేళ్ల విరహ వేదన.. ప్రియుడికి హగ్, ముద్దులు ఇచ్చి తుపాకీతో కాల్చిన గర్ల్ ఫ్రెండ్..!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఓ ప్రియురాలు తన ప్రియుడికి ఊహించని షాక్ ఇచ్చింది. ఇలా చేస్తుందని అతను కూడా ఊహించి ఉండడు. అంతలా ఆ ప్రేయసి ఏం చేసిందో తెలిస్తే నిజంగా నోరెళ్లబెడతారు. సాధారణంగా ప్రేమికుల మధ్య గ్యాప్ అనేది పెరిగితే ఇద్దరి మధ్య అది విరహ వేదనకు కారణం అవుతుంది. కొంత కాలం తర్వాత కలుసుకుంటే ప్రేమికుల మధ్య రిలేషన్ అనేది మరింత బలపడుతుంది. కానీ ఏకంగా ప్రియుడిని చంపేంత ప్రేమ ఉంటుందని ఎవరైనా ఊహిస్తారా? బహుశా ఇలాంటి ఘటన ఎక్కడా జరిగి ఉండకపోవచ్చు. కానీ తొలిసారి వెస్ట్ బెంగాల్ రాష్ట్రం పూర్బా బర్దామాన్ జిల్లాలో శుక్రవారం వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. బెంగాల్ రాష్ట్రంలో యువతీ యువకులు ప్రేమించుకున్నారు. వీరిద్దరి మధ్య అనుకోకుండా నాలుగు సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత కలుసుకున్న వీరిద్దరూ చాలా హ్యాపీగా గడిపారు.. నాలుగేళ్ల విరహ వేదనతో ఉన్న యువతి ప్రియుడిపై ముందుగా ముద్దుల వర్షం కురిపించింది. కౌగిలింతలు కూడా ఇచ్చింది. ఇద్దరూ కలిసి సిగరేట్స్ తాగారు.

ఈ క్రమంలోనే తన పాకెట్‌లో దాచుకున్న గన్ తీసిన యువతి ప్రియుడిపై కాల్పులు జరిపింది. ఓ బుల్లెట్ అతని పొత్తి కడుపులోకి వెళ్లడంతో వైద్యులు ఆపరేషన్ చేసి బుల్లెట్ రిమూవ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, తనకు నాలుగేళ్లు దూరంగా ఉన్నాడనే కారణంతో అతన్ని గన్‌తో కాల్చినట్టు యువతి విచారణలో తెలపడంతో పోలీసులు కూడా షాక్ అయ్యారట.. ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Next Story