గాల్లో ఎగిరే వడలు.. ఈ హోటల్ స్పెషల్

by  |
గాల్లో ఎగిరే వడలు.. ఈ హోటల్ స్పెషల్
X

దిశ, ఫీచర్స్ : ముంబైలోని మంగల్‌దాస్ మార్కెట్‌లో ఉండే ‘శ్రీ బాలాజీ దోశ’ సెంటర్‌లో గాల్లో ఎగిరే దోశలు(దోశ పెనం మీద నుంచి నేరుగా ప్లేట్లో వేయడం) గురించి తెలిసే ఉంటుంది. అప్పట్లో ఈ దోశ మేకింగ్ వీడియో నెట్టింట వైరల్ కాగా, అలాంటిదే మరొక వీడియో లేటెస్ట్ ట్రెండింగ్‌లో ఉంది. అయితే ఈసారి దోశ కాకుండా వడను గాల్లోకి ఎగరేసి తయారు చేయడాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ హోటల్‌లో వడతో పాటు దోశ, ఇడ్లీ, వడాపావ్స్ తదితర టిఫిన్స్ తయారు చేస్తున్నారు.

ముంబైలోని దొరబజార్ వీధిలోని ‘రఘు దోశవాలా’ ఫుడ్ స్టాల్.. గాల్లో ఎగిరే వడల తయారీకి ఫేమస్. ఈ హోటల్‌ను నడిపిస్తున్న 60 ఏళ్ల రఘు వడ తయారు చేస్తుండగా, ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది ట్రెండ్ అవుతోంది. రఘు యూనిక్ స్టైల్‌లో వడ చేస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మసాలా వడా‌పావ్ తయారీలో భాగంగా రఘు.. వడను గరిటెతో గాల్లో ఎగరేసి పాన్(కడాయి) మీదకు తీసుకుంటున్న స్టైల్‌కు కస్టమర్లు ఫిదా అవుతున్నారు. కాగా ఈ హోటల్‌లో వడాపావ్ టేస్ట్‌ సూపర్బ్‌గా ఉంటుదని స్థానికులు చెప్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story