- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆంధ్ర వ్యక్తికి కరోనా.. యూపీలో 14 గ్రామాలు సీల్
<p>లక్నో: కరోనా మహమ్మారి చాపకింది నీరులా వ్యాపిస్తుండటంతో దాని కట్టడికి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఒక్క కేసు నమోదైనా.. పేషెంట్ చుట్టుపక్కలవారిని పరీక్షిస్తున్నారు. ఆ పేషెంట్ తిరిగిన ప్రాంతాల్లో అతను కలుసుకున్నవారి వివరాలను వాకబు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోనైతే ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ తేలడంతో అధికారులు ఏకంగా 14 గ్రామాలను సీల్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉత్తరప్రదేశ్ బదౌన్ జిల్లాలో భవానిపుర్ కాళీ ఏరియాలోని ఓ మసీదులో ఉంటున్నాడు. గతనెల ఢిల్లీ నిజాముద్దీన్‌లో మసీదులో నిర్వహించిన […]</p>

లక్నో: కరోనా మహమ్మారి చాపకింది నీరులా వ్యాపిస్తుండటంతో దాని కట్టడికి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఒక్క కేసు నమోదైనా.. పేషెంట్ చుట్టుపక్కలవారిని పరీక్షిస్తున్నారు. ఆ పేషెంట్ తిరిగిన ప్రాంతాల్లో అతను కలుసుకున్నవారి వివరాలను వాకబు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోనైతే ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ తేలడంతో అధికారులు ఏకంగా 14 గ్రామాలను సీల్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉత్తరప్రదేశ్ బదౌన్ జిల్లాలో భవానిపుర్ కాళీ ఏరియాలోని ఓ మసీదులో ఉంటున్నాడు. గతనెల ఢిల్లీ నిజాముద్దీన్‌లో మసీదులో నిర్వహించిన సదస్సులో పాల్గొన్నాడు. శనివారం అతనికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో జిల్లా అధికారులు అతను నివసిస్తున్న ఊరికి చుట్టుపక్కలున్న 14 గ్రామాలను సీల్ చేశారు. ఈ 14 గ్రామాలను క్వారంటైన్‌లో ఉంచినట్టు జిల్లా మెజిస్ట్రేట్ కుమార్ ప్రశాంత్ వెల్లడించారు.
tags: quarantine, uttar pradesh, coronavirus, andhra pradesh, badaun, tablighi mosque






