తాలిబన్ల అరాచకం:మమ్మల్ని అలా చేస్తున్నారు కాపాడండి- మహిళా జర్నలిస్ట్

by Vadlamudi Anukaran |   (  Updated:2021-08-19 23:02:19  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్:  ఆఫ్ఘనిస్తాన్‌ లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. తాలిబన్లు ఆక్రమణ తర్వాత అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. అక్కడ నివసిస్తున్న ప్రజలందరూ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్నారు. ముఖ్యంగా మహిళలు.. వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లింది. ఇటీవలే ఒక మహిళ ముఖాన్ని కప్పుకోలేదని నిర్ధాక్షిణ్యంగా చంపేసిన ఘటన తెలిసిందే. ఇక తాజాగా  తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆఫ్గాన్‌కు చెందిన ఓ మహిళా న్యూస్ యాంకర్ వీడియో ద్వారా వెల్లడించింది. షబ్నమ్ ఖాన్ దవ్రాన్‌ అనే మహిళా [&hellip;]</p>

తాలిబన్ల అరాచకం:మమ్మల్ని అలా చేస్తున్నారు కాపాడండి- మహిళా జర్నలిస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్ఘనిస్తాన్‌ లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. తాలిబన్లు ఆక్రమణ తర్వాత అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. అక్కడ నివసిస్తున్న ప్రజలందరూ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్నారు. ముఖ్యంగా మహిళలు.. వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లింది. ఇటీవలే ఒక మహిళ ముఖాన్ని కప్పుకోలేదని నిర్ధాక్షిణ్యంగా చంపేసిన ఘటన తెలిసిందే. ఇక తాజాగా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆఫ్గాన్‌కు చెందిన ఓ మహిళా న్యూస్ యాంకర్ వీడియో ద్వారా వెల్లడించింది.

షబ్నమ్ ఖాన్ దవ్రాన్‌ అనే మహిళా జర్నలిస్ట్‌ ఆఫ్గన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆర్టీఏ టీవీ ఛానెల్‌లో కొన్నేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల తాను పనిచేసే ఆఫీస్‌కు వెళ్లగా.. సిబ్బంది తనను లోనికి అనుమతించలేదంటూ షబ్నమ్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క పురుషులను లోనికి అనుమతిస్తున్నారు. నా ఐడీ కార్డు చూపించినా కూడా వారు నన్ను లోనికి అనుమతించలేదు. తాలిబన్లు ఆఫ్గన్‌ను ఆక్రమించుకోవడంతో వ్యవస్థ మారిపోయిందని.. అందుకే నన్ను లోపలికి పంపలేమని తెలిపారు. ఇకపై మహిళా జర్నలిస్టులను అనుమతించట్లేదని నన్ను వెనక్కి పంపేశారు అని చెప్పుకొచ్చింది. ” నా మాటలు వింటున్నవారు.. ఒకవేళ ప్రపంచం నా మాటలు వింటుంటే.. దయచేసి మాకు సహాయం చేయండి.. మేం ఆపదలో ఉన్నాం.. మా ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది” అని షబ్నమ్‌ ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Next Story