- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అడ్మిన్ అరాచకం.. మహిళా పోలీస్‌ను లైంగికంగా..
<p>దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో మహిళలపై వేధింపులు ఆగడం లేదు. సాధారణ మహిళ నుంచి పోలీస్‌శాఖలో ఉన్న మహిళల వరకు వేధింపులు ఏమాత్రం ఆగడం లేదు. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఓ సచివాలయంలో మహిళా పోలీస్‌నే సచివాలయం అడ్మిన్ వేధింపులకు గురి చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. తాడేపల్లి 12, 13వార్డ్ సచివాలయం అడ్మిన్‌గా కిశోర్ పనిచేస్తున్నారు. అయితే కిశోర్ తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ, మహిళా పోలీస్ దిశా యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో […]</p>

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో మహిళలపై వేధింపులు ఆగడం లేదు. సాధారణ మహిళ నుంచి పోలీస్‌శాఖలో ఉన్న మహిళల వరకు వేధింపులు ఏమాత్రం ఆగడం లేదు. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఓ సచివాలయంలో మహిళా పోలీస్‌నే సచివాలయం అడ్మిన్ వేధింపులకు గురి చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. తాడేపల్లి 12, 13వార్డ్ సచివాలయం అడ్మిన్‌గా కిశోర్ పనిచేస్తున్నారు. అయితే కిశోర్ తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ, మహిళా పోలీస్ దిశా యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గతంలో కూడా అడ్మిన్ కిషోర్‌పై అనేక ఆరోపణలు ఉన్నాయి. వార్డు వాలంటీర్లతో పాటు సచివాలయ ఉద్యోగులను కూడా వేధించేవాడని తెలుస్తోంది. అడ్మిన్ కిషోర్ ప్రవర్తనపై మున్సిపల్ శాఖ అధికారులకు వాలంటీర్లతో పాటు సచివాలయ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. అయితే ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అడ్మిన్ కిశోర్ మరింత రెచ్చిపోయాడు. అయితే మహిళా పోలీసు ఫిర్యాదుపై తాడేపల్లి పోలీసులు స్పందించారు. వెంటనే నిందితుడు కిశోర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.






