అతడి పాత్ర నాకో పాఠం.. యంగ్ హీరో కామెంట్స్

by  |
Major
X

దిశ, వెబ్‌డెస్క్: అత్యంత ధైర్యవంతమైన ఆ వ్యక్తి జీవిత గాధ అందరికీ ఓ కథే కావచ్చు.. తనకు మాత్రం ఓ పాఠం అంటున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేషు. మహేష్ బాబు నిర్మాతగా తెరకెక్కిస్తున్న సినిమా మేజర్. ఈ సినిమాలో ప్రధాన పాత్ర మేజర్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడవి శేషు కనిపించనున్నాడు. ఈ సినిమా నుంచి అప్‌డేట్ వచ్చి చాలా కాలం అయింది. దీంతో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన అడవి శేషు తన సినిమాపై మాట్లాడాడు.

‘26/11 తాజ్‌ హోటల్ బాంబ్ బ్లాస్ట్‌లో వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన అత్యంత ధైర్య శాలి సందీప్ ఉన్నికృష్ణన్. అతడి జీవితం అందరికీ ఓ కథ కావచ్చు. నాకు మాత్రం అతడి జీవితం చాలా నేర్పించింది. అతడి పాత్ర భౌతికంగా చేసేది నేనే అయినా మానసికంగా అడవి శేషు కాదు’ అని అన్నాడు. అంతేకాకుండా సందీప్ ఒక్కరికే కాదు. ఆనాడు ప్రజల ప్రాణాలకు తమ ప్రాణం అడ్డేసిన ప్రతి ఒక్క వీరుడికి మేము తలొంచుతున్నాము, వారందరి వీరత్వానికి మా సినిమా ఓ ప్రతీక కావాలని కోరుకుంటున్నాము అని అన్నాడు.

ఇప్పటికే విడుదలైన 94 క్షణాల టీజర్ అందరినీ ఆకట్టుకుంది. ఇందులో మేజర్ సందీప్ పాత్రలో అడవి శేషు ఎంతో భావోద్వేగంగా మాట్లాడటం మనం చూశాం. దీంతో ఈ సినిమాతో అడవి శేషు మరోసారి తానేంటో నిరూపించుకుంటాడని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకి రానుంది.


Next Story

Most Viewed