PSPK27 సెట్లో ప్రమాదం.. కీలక నటుడికి గాయాలు

by  |
PSPK27 సెట్లో ప్రమాదం.. కీలక నటుడికి గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ తర్వాత నటిస్తున్న చిత్రం ‘హరహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే హిస్టోరికల్ అంటేనే యుద్ధాలు గుర్రపు స్వారీలు కత్తిసాము భారీ ఫైట్ సీక్వెన్స్ ఇలా ఎన్నో రకాల సన్నివేశాలు ఉంటాయి. ఒక్కోసారి ఈ సన్నివేశాల్లో పాల్గొన్న నటులకు కొన్ని ప్రమాదాలు తప్పవు.

తాజాగా ఒక యాక్షన్ సన్నివేశంలో పాల్గొన్న నటుడు ఆదిత్య మీనన్ ప్రమాదానికి గురయ్యారు. ఈ షూటింగ్ లో గుర్రపు స్వారీ చేస్తున్నప్పుడు ప్రమాదవ శాత్తు కిందపడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆదిత్య మీనన్ చెన్నలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ప్రమాదం గత నాలుగు రోజుల క్రితం జరిగిందని , ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చిత్ర బృందం తెలిపింది.

Next Story

Most Viewed