అమీర్ కొడుకు పర్ఫెక్ట్ ఎంట్రీ?

by  |
అమీర్ కొడుకు పర్ఫెక్ట్ ఎంట్రీ?
X

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్.. దశాబ్దాలుగా వెండితెరను ఏలుతున్నాడు. సినిమా సినిమాకు క్యారెక్టర్ డిమాండ్‌ను బట్టి బాడీని మార్చుకునే అమీర్.. దంగల్ సినిమాలో తండ్రి పాత్ర కోసం ఎంతగా కష్టపడ్డాడో తెరపై కనిపించింది. ఆ తర్వాత చేస్తున్న ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాలోనూ పాత్రకు తగినట్లుగా బరువు తగ్గాడు. ఇక బరువు తగ్గలేడని ఎవరెన్ని కామెంట్స్ చేసినా పట్టించుకోకుండా ట్రై చేసి చూపించి.. ఆఫ్ కోర్స్ అమీర్ మిస్టర్ పర్ఫెక్ట్ అని రుజువు చేశాడు.

ఇదిలా ఉంటే, బాలీవుడ్‌లో నెపోటిజం వివాదం ఇంకా సద్దుమణగక ముందే వారసున్ని ఇండస్ట్రీలో దింపే ప్రయత్నంలో ఉన్నాడట అమీర్. యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ముందుండే ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా.. అమీర్ కొడుకు జునైద్‌ను పరిచయం చేయనున్నాడని టాక్. అయితే స్టార్ కొడుకు అని ట్రీట్ చేయకుండా.. అందరిలాగే తనకు కూడా ఆడిషన్స్ నిర్వహించాకే సెలెక్ట్ చేశారని తెలుస్తోంది. థియేటర్ ఆర్టిస్ట్ అయిన జునైద్.. పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. యాక్టింగ్‌లో మెళకువలు నేర్చుకునేందుకు వర్క్ షాప్స్‌కు హాజరు అవుతున్నాడని.. జూనియర్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌గా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని సమాచారం.

కాగా జునైద్ పరిచయం కాబోయే సినిమా యశ్ రాజ్ ఫిల్మ్స్ 50వ ప్రాజెక్ట్ కూడా అయి ఉండొచ్చు అని తెలుస్తుంది.


Next Story

Most Viewed