‘మహాసముద్రం’లో అలలా.. అదితి!

by  |
‘మహాసముద్రం’లో అలలా.. అదితి!
X

దిశ, వెబ్‌డెస్క్ :
వర్సటైల్ హీరో శర్వానంద్, సీజన్డ్ యాక్టర్ సిద్దార్థ్‌ల మల్టీస్టారర్ మూవీ ‘మహాసముద్రం’. అజయ్ భూపతి డైరెక్షన్‌లో వస్తున్న ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామాను ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. వెల్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా బౌండెడ్ స్క్రిప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అందాల రాజకుమారి అదితి రావు హైదరి ఎంట్రీ ఇచ్చింది. మహాసముద్రంలో చల్లటి గాలిని తీసుకొచ్చే అలగా అదితిని అభివర్ణిస్తూ దీనిపై అధికారిక ప్రకటన చేసింది నిర్మాణ సంస్థ. సినిమా గురించి ఒక్కోవారం ఒక్కో సర్‌ప్రైజ్ న్యూస్ అందిస్తోన్న మేకర్స్.. ఈ వారం అందించిన న్యూస్‌తో ఖుష్ అయ్యారు ఫ్యాన్స్. టాలెంటెడ్ హీరోయిన్ అదితి ఈ సినిమాలో స్టన్నింగ్ రోల్‌తో అలరించనుండగా.. శర్వాకు జోడీగా నటిస్తుందా లేక సిద్ధుతో రొమాన్స్ చేయబోతుందా తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే, గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక మోహన్ కూడా ‘మహాసముద్రం’లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై నెక్స్ట్ వీక్ అప్‌డేట్ వచ్చే చాన్స్ ఉండగా.. అదితి రాకతో మహాసముద్రం మరింత బిగ్గర్ ప్రాజెక్ట్ అయిందని గ్రాండ్ వెల్‌కమ్ చెప్పింది టీమ్. చాలా మంది హీరోయిన్లను పరిశీలించాకే ఈ ఫర్మార్మెన్స్ ఓరియంటెడ్ రోల్‌కు అదితిని ఫైనల్ చేసినట్లు తెలిపింది. అదితి కూడా ఈ రోల్ చేసేందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నట్లు చెప్పింది. కాగా తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న సినిమాలో ఇంతమంది టాలెంటెడ్ యాక్టర్స్ స్క్రీన్ షేర్ చేసుకోవడం కనుల పండగలా ఉండబోతుందని.. 100 పర్సంట్ అదిరిపోయే ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వబోతుందని చెబుతున్నారు దర్శక, నిర్మాతలు.


Next Story

Most Viewed