హైదరాబాద్‌లో ఆదిపురుష్ షూటింగ్..

by  |
Adipurush
X

దిశ, సినిమా: కొవిడ్-19 సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుండగా.. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు పలు రాష్ట్రాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న మహారాష్ట్ర సైతం ఫిలిం షూటింగ్స్‌పై ఆంక్షలు విధించింది. ఈ ప్రభావం ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీ ఖాన్ లీడ్ రోల్స్ పోషిస్తున్న ‘ఆదిపురుష్’పై కూడా పడింది. మార్చి చివరి వారం వరకు ముంబైలోనే షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ.. కొత్త షెడ్యూల్‌ను కొన్ని వారాల క్రితమే మొదలుపెట్టాల్సి ఉండగా కొవిడ్ నిబంధనల వల్ల ప్రారంభించలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలోని మెయిన్ లీడ్‌కు సంబంధించిన సీన్లను హైదరాబాద్‌లో చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తు్న్నట్టు తెలుస్తోంది.

ఈ మేరకు దర్శకుడు ఓం రౌత్.. హైదరాబాద్‌లో షూటింగ్ జరగనున్న స్టూడియోలో స్టార్ కాస్ట్, సిబ్బంది విషయంలో పాటించాల్సిన సేఫ్టీ ప్రొటోకాల్స్‌పై దృష్టిపెట్టినట్టు సమాచారం. అనుకున్నవన్నీ సెట్ అయితే నెక్ట్స్ షెడ్యూల్ మే 15 నుంచి స్టార్ట్ కానుందని టాక్. ఇక రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో ప్రభాస్, కృతి సీతారాములుగా కనిపించనుండగా సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను డైరెక్టర్ ఓం రౌత్‌తో కలిసి భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Next Story

Most Viewed