- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆదిపురుష్’ నుంచి సైఫ్ అలీఖాన్‌కు వీడ్కోలు..
<p>దిశ, సినిమా : బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఈ మూవీలో లంకేశ్‌గా నటిస్తున్న బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీఖాన్ తాజాగా షూటింగ్‌ను పూర్తి చేసినట్లు మేకర్స్ తెలిపారు. ప్రభాస్ రాముడుగా, సైఫ్ రావణ్ పాత్రలో, కృతి సనన్ సీతగా, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ముంబైలో శరవేగంగా […]</p>

దిశ, సినిమా : బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఈ మూవీలో లంకేశ్‌గా నటిస్తున్న బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీఖాన్ తాజాగా షూటింగ్‌ను పూర్తి చేసినట్లు మేకర్స్ తెలిపారు. ప్రభాస్ రాముడుగా, సైఫ్ రావణ్ పాత్రలో, కృతి సనన్ సీతగా, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ముంబైలో శరవేగంగా సాగుతుండగా, సైఫ్ షూటింగ్ ముగిసిన విషయాన్ని మూవీ కస్ట్యూమ్ డిజైనర్ నచికేత్ బార్వే తెలిపారు. ఈ నేపథ్యంలో సైఫ్ అలీఖాన్‌కు వీడ్కోలు పలుకుతూ సెట్‌లో కేక్ కట్ చేశారు. ఆ ఫోటోలను దర్శకుడు ఓంరౌత్ శనివారం ట్వీట్టర్ ఖాతాలో షేర్ చేయగా.. సైఫ్‌తో షూటింగ్ ఎంతో వినోదాన్ని కలిగించిందని ట్వీట్టర్‌లో వివరించాడు. ఇక ‘తానాజీ’ తర్వాత మళ్ళీ వీరిద్దరూ కలిసి ఆదిపురుష్ కోసం పని చేయడం విశేషం.
- Tags
- Adipurush






