- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆదిలాబాద్ – నాందేడ్ రైలులో అగ్నిప్రమాదం
<p>దిశ ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్- నాందేడ్ ట్రైన్‌లో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ నుంచి నాందేడ్‌కు బుధవారం ఉదయం ఇంటర్సిటీ ప్యాసింజర్ రైలు బయలుదేరింది. జిల్లాలోని తలమడుగు మండలం డోర్లి గేట్ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా రైలు ఇంజన్‌లో పొగలు వచ్చాయి. అప్రమత్తమైన లోకో ఫైలట్ వెంటనే రైలును నిలిపివేశారు. ఉన్నట్టుండి రైల్లో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. రైలు ఆగడంతో భయాందోళనతో ప్రయాణికులు రైలు నుంచి బయటకు పరుగులు తీశారు. […]</p>

X
దిశ ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్- నాందేడ్ ట్రైన్‌లో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ నుంచి నాందేడ్‌కు బుధవారం ఉదయం ఇంటర్సిటీ ప్యాసింజర్ రైలు బయలుదేరింది. జిల్లాలోని తలమడుగు మండలం డోర్లి గేట్ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా రైలు ఇంజన్‌లో పొగలు వచ్చాయి. అప్రమత్తమైన లోకో ఫైలట్ వెంటనే రైలును నిలిపివేశారు.
ఉన్నట్టుండి రైల్లో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. రైలు ఆగడంతో భయాందోళనతో ప్రయాణికులు రైలు నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ విషయంపై రైల్వే అధికారులకు సమాచారం అందించగా సాంకేతిక సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించారు. అయితే ఈ ప్రమాదం డిజిల్ లీకేజీ వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుందని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. రైలు ఇంజన్‌కు మరమ్మతులు చేసి ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చారు.
Next Story






