- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యతిరేకించడం కేసీఆర్‌కు అలవాటు : సోయం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు, రైతులు పెద్ద ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు స్పందించారు. సోమావారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. కార్పొరేట్ కోసం తెచ్చారంటూ రైతులను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు చట్టంతో దళారి వ్యవస్థ లేకుండా పోతోందని టీఆర్ఎస్ నేతల ఆవేదన చెందుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ బిల్లులను […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు, రైతులు పెద్ద ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు స్పందించారు. సోమావారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. కార్పొరేట్ కోసం తెచ్చారంటూ రైతులను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు చట్టంతో దళారి వ్యవస్థ లేకుండా పోతోందని టీఆర్ఎస్ నేతల ఆవేదన చెందుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ బిల్లులను వ్యతిరేకించడం కేసీఆర్‌కు అలవాటని అన్నారు. రైతు బిల్లుకు రైతుల మద్దతు ఇవ్వాలని సోయం బాపురావు కోరారు.
Next Story






