- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ ఇకలేరు..
<p>దిశప్రతినిధి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ నాందేవ్ కాంబ్లే బుధవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. తెల్లవారు జామున గుండె పోటు రావడంతో ఆయన్ను హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం గుంజాల గ్రామానికి చెందిన నాందేవ్ కాంబ్లే ఏడాది కిందట డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికోబడ్డారు. ఆయన అకాల మరణం పట్ల జిల్లా మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు […]</p>

దిశప్రతినిధి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ నాందేవ్ కాంబ్లే బుధవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. తెల్లవారు జామున గుండె పోటు రావడంతో ఆయన్ను హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం గుంజాల గ్రామానికి చెందిన నాందేవ్ కాంబ్లే ఏడాది కిందట డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికోబడ్డారు. ఆయన అకాల మరణం పట్ల జిల్లా మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేయడమే కాకుండా.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ నాందేవ్ కాంబ్లే హఠాన్మరణం పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. నాందేవ్ మృతి చాలా బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.






