- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా ఉంటాం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగేదాక పోలీసుశాఖ అండగా నిలుస్తుందని అడిషనల్ డీజీపీ రవిశంకర్ అయ్యనార్ భరోసానిచ్చారు. గురువారం మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రీతి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించినందున విచారణలో వారికి సహకరిస్తామన్నారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడే నేరస్తులను శిక్షించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని తెలిపారు. సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు స్పందిస్తూ తమ కోరిక మేరకు ప్రభుత్వం […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగేదాక పోలీసుశాఖ అండగా నిలుస్తుందని అడిషనల్ డీజీపీ రవిశంకర్ అయ్యనార్ భరోసానిచ్చారు. గురువారం మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రీతి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించినందున విచారణలో వారికి సహకరిస్తామన్నారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడే నేరస్తులను శిక్షించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని తెలిపారు. సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు స్పందిస్తూ తమ కోరిక మేరకు ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తమ కూతురు మృతికి కారకులైన అసలు నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.
Next Story






