- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అడిషినల్ డీజీపీకీ తప్పిన పెనుప్రమాదం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లా నందిగామ అడిషనల్ డీజీపీ కృపానంద్ త్రిపాటి ఉజేలాకు పెను ప్రమాదం తప్పింది. కంచికచర్ల పట్టణం శివారులో బైకును అడిషినల్ డీజీపీ కారు ఢీ కొట్టింది. బైకును ఢీకొన్న కారు రహదారి కందకంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడు కంచికచర్ల పట్టణానికి చెందిన కర్రీ నరసింహారావుగా గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న అడిషనల్ డీజీపీ కృపానంద్ త్రిపాటి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లా నందిగామ అడిషనల్ డీజీపీ కృపానంద్ త్రిపాటి ఉజేలాకు పెను ప్రమాదం తప్పింది. కంచికచర్ల పట్టణం శివారులో బైకును అడిషినల్ డీజీపీ కారు ఢీ కొట్టింది. బైకును ఢీకొన్న కారు రహదారి కందకంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడు కంచికచర్ల పట్టణానికి చెందిన కర్రీ నరసింహారావుగా గుర్తించారు.
ప్రమాద సమయంలో కారులో ఉన్న అడిషనల్ డీజీపీ కృపానంద్ త్రిపాటి ఉజేలా సురక్షితంగా బయటపడ్డారు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆయన్ను మరో కారులో తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






