అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. మొక్కలు పెంచాలని సూచన

by  |

దిశ, సారంగాపూర్: హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించే విధంగా చూడాలని అడిషనల్ కలెక్టర్ హేమంత్ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని జెవులీ గ్రామపంచాయతీ పరిధిలో బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బృహత్ పల్లె ప్రకృతి వనం పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడే మొక్కలను పెంచాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో సరోజ, ఎంపీవో తిరుపతిరెడ్డి, జెవులీ సర్పంచ్ భాగ్యలక్ష్మి మధుకర్, పలువురు అధికారులు ఉన్నారు.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story