డ్యూటీ మరిచిన మరిపెడ కమిషనర్.. అడిషనల్ కలెక్టర్ కీలక ఆదేశాలు

by  |
డ్యూటీ మరిచిన మరిపెడ కమిషనర్.. అడిషనల్ కలెక్టర్ కీలక ఆదేశాలు
X

దిశ, మరిపెడ : అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు అయిన ఘటనలో మరిపెడ మున్సిపల్ కమిషనర్ పై వేటు పడింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కమిషనర్ గణేష్ బాబు.. పై ఉన్నతాధికారుల అనుమతి లేకుండా గత 15 రోజుల నుంచి విధులకు హాజరుకావడం లేదు. ఈ విషయం పై అధికారుల వరకు వెళ్లడంతో అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సత్యనారాయణ అక్టోబర్ 13న మున్సిపల్ కమిషనర్ గణేష్ బాబును సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల కాపీని సిద్ధం చేసి పెట్టారు.

కమిషనర్ సోమవారం విధులకు హాజరు అవుతానని ఉన్నతాధికారుకు సమాచారం ఇవ్వగా, ఆ సస్పెన్షన్ ఆర్డర్ కాపీని ఇన్నిరోజుల వరకు పెండింగ్‌లో పెట్టారు. నిన్న కూడా కమిషనర్ విధులకు హాజరుకాకపోవడంతో విధుల నుంచి తప్పిస్తూ సోమవారం రాత్రి అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం కమిషనర్‌ను జిలా హెడ్‌కు అటాచ్ చేసినట్టు తెలుస్తోంది.



Next Story

Most Viewed