క్లియర్‌ట్రిప్‌లో అదానీ గ్రూప్ పెట్టుబడులు!

by  |
క్లియర్‌ట్రిప్‌లో అదానీ గ్రూప్ పెట్టుబడులు!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో భాగమైన ఆన్‌లైన్ ట్రావెల్ అగ్రిగేటర్ క్లియర్‌ట్రిప్‌లో దేశీయ దిగ్గజ అదానీ గ్రూప్ పెట్టుబడులు పెడుతున్నట్టు వెల్లడించింది. ఈ పెట్టుబడుల ద్వారా అదానీ గ్రూప్ క్లియర్‌ట్రిప్‌లో గణనీయమైన మైనారిటీ వాటాను కొనుగోలు చేయనుంది. తద్వారా ఫ్లిప్‌కార్ట్‌తో అదానీ గ్రూప్ సంస్థ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

అయితే ఈ పెట్టుబడులకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించలేదు. షరతులకు లోబడి ఈ ఏడాది నవంబర్‌లోగా ఈ ఒప్పందం ముగుస్తుందని సమాచారం. ‘ఈ పెట్టుబడుల ద్వారా అదానీ గ్రూప్, ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ భాగస్వామ్యం నుంచి అనేక ప్రయోజనాలు ఉంటాయి. దేశీయంగా కరోనా మహమ్మారి నుంచి పునరుద్ధరణ దిశగా వృద్ధి సాధిస్తున్న ప్రయణానికి సంబంధించి వినియోగదారులకు మెరుగైన సేవలందించనున్నట్టు’ అదానీ గ్రూప్ అధికారిక ప్రకటనలో వివరించింది.

క్లియర్‌ట్రిప్ విమాన టికెట్ల బుకింగ్‌లో 10 రెట్లు వృద్ధిని సాధించింది. ఇదే సమయంలో విమానాశ్రయాల్లో ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీనిని చూస్తుంటే కరోనా ముందు స్థాయికి చేరుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు సంస్థల మధ్య భాగస్వామ్యంతో డిజిటల్ సరిహద్దులను అధిగమించి, ఆన్‌లైన్ ఎండ్-టూ-ఎండ్ ట్రావెల్ సేవలను తీసుకురావడానికి వీలవుతుందని కంపెనీ వెల్లడించింది.


Next Story

Most Viewed