మనుషుల కన్నా జంతువులే నయం : అదా శర్మ

91

దిశ, సినిమా : టాలెంటెడ్ అదా శర్మ, ఏ పని చేసినా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేస్తుంటుంది. మూవీ సెలెక్షన్ నుంచి పర్సనల్ లైఫ్ వరకు ప్రతీ పనిని భిన్నంగా ప్రయత్నించే అదా.. లేటెస్ట్ షార్ట్ ఫిల్మ్ ‘చూహా బిల్లి’లో తన యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేసింది. ఈ క్రమంలో ఐదు తెలుగు సినిమాలకు సైన్ చేసిన భామ.. ఓ చిత్రం షూటింగ్‌ స్పాట్‌లో గాయపడిన పక్షిని రక్షించి అభిమానుల కోరిక మేరకు ‘ట్విట్టర్’ అని పేరు కూడా పెట్టింది. కాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి ప్రస్తావించిన అదా.. మనుషుల కన్నా జంతువులతోనే ఎక్కువ కంఫర్ట్‌గా ఫీల్ అవుతానని తెలిపింది. పార్టీలు, ఫంక్షన్స్‌లో అపరిచితులతో స్పెండ్ చేయడం చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుందని, కానీ అడవుల్లో జంతువుల మధ్య వదిలేస్తే మాత్రం ఇల్లులా ఫీల్ అవుతానంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..