నేను వేసే జోకులకు నవ్వితే చాలు : అదా శర్మ

by  |
నేను వేసే జోకులకు నవ్వితే చాలు : అదా శర్మ
X

దిశ, వెబ్‌డెస్క్ :
అందాల భామ అదా శర్మ తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చెప్పింది. మందిరా బేడీ హోస్ట్ చేస్తున్న ఓ షోలో పాల్గొన్న అదా.. మ్యాజిక్, మార్షల్ ఆర్ట్స్ వచ్చినవాడు అయితే బెటర్ అని వెల్లడించింది. జంతువులతో ప్రేమగా ఉండాలని.. సినిమాలు చూసేందుకు స్టామినా ఉండాలని తెలిపింది. తనకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాల్సిన అవసరం లేదని, తను వేసే జోకులకు నవ్వితే చాలని చెప్పింది. కనీసం 30 వేల అంకెలను పఠించగలగాలి అంటూ లిస్ట్ చెప్పుకొచ్చింది భామ.

కాగా ఈ పోస్ట్‌పై కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరీ అంతలా ఎక్స్‌పెక్టేషన్స్ వద్దని.. దేవుడికి పర్సనల్‌గా రిక్వెస్ట్ పెడితే గానీ, నీ డ్రీమ్ ఫుల్‌ఫిల్ అవ్వదని చెప్తున్నారు. అయితే ప్రతీ ఒక్కరికి ఓపిగ్గా సమాధానం చెప్పిన అదా.. తన క్వాలిటీస్ తనకు ఉంటాయని, తప్పు పట్టాల్సిన అవసరం లేదని చెప్పింది.



Next Story

Most Viewed