- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శివసేనలో చేరిన సినీనటి ఊర్మిళ
by Shamantha N |
<p>ముంబయి: సినీనటి ఊర్మిళా మతోండ్కర్ శివసేనలో చేరారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి పరాజయం పాలైన ఆమె సెప్టెంబర్‌లో హస్తం పార్టీ నుంచి తప్పుకున్నారు. ఏడాది తర్వాత మంగళవారం శివసేన పార్టీ కండువా కప్పుకున్నారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ముంబయి మేయర్ కిశోరీ పడ్నేకర్, కాంగ్రెస్ నుంచి శివసేనలో చేరిన ప్రియాంక చతుర్వేదిల సమక్షంలో ఊర్మిళను సీఎం సతీమణి రష్మీ ఠాక్రే ఆహ్వానించారు. శివసేనలో అధికారికంగా చేరకముందే శివసేన ఆమెను గవర్నర్ […]</p>

X
ముంబయి: సినీనటి ఊర్మిళా మతోండ్కర్ శివసేనలో చేరారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి పరాజయం పాలైన ఆమె సెప్టెంబర్‌లో హస్తం పార్టీ నుంచి తప్పుకున్నారు. ఏడాది తర్వాత మంగళవారం శివసేన పార్టీ కండువా కప్పుకున్నారు.

సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ముంబయి మేయర్ కిశోరీ పడ్నేకర్, కాంగ్రెస్ నుంచి శివసేనలో చేరిన ప్రియాంక చతుర్వేదిల సమక్షంలో ఊర్మిళను సీఎం సతీమణి రష్మీ ఠాక్రే ఆహ్వానించారు. శివసేనలో అధికారికంగా చేరకముందే శివసేన ఆమెను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అంతర్గతంగా నడుస్తున్న రాజకీయాల నుంచి తప్పుకోవడానికి పార్టీని వీడినట్టు ఆమె తెలిపారు.
Next Story






