చిరు 'ఆచార్య' నుంచి త్రిష ఔట్

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి &#8216;ఆచార్య&#8217; మూవీ నుంచి తప్పుకున్నట్లు వెల్లడించింది హీరోయిన్ త్రిష. కొన్ని సార్లు ముందుగా చెప్పినట్లుగా, చర్చించినట్లుగా జరగకపోవచ్చు. ఈ ప్రాజెక్టు విషయంలోనూ అదే జరిగింది. కొన్ని విబేధాల కారణంగా తాను ఈ ప్రాజెక్టులో కొనసాగాలని అనుకోవడం లేదన్నారు. ఆచార్య మూవీ టీంకు ఆల్ ద బెస్ట్ చెప్పిన త్రిష&#8230; మరో మంచి ప్రాజెక్ట్‌తో తెలుగు ఆడియన్స్‌ను అలరిస్తానని తెలిపారు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న &#8216;ఆచార్య&#8217; మూవీలో ముందుగా త్రిషకు ఫుల్ [&hellip;]</p>

చిరు ఆచార్య నుంచి త్రిష ఔట్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ మూవీ నుంచి తప్పుకున్నట్లు వెల్లడించింది హీరోయిన్ త్రిష. కొన్ని సార్లు ముందుగా చెప్పినట్లుగా, చర్చించినట్లుగా జరగకపోవచ్చు. ఈ ప్రాజెక్టు విషయంలోనూ అదే జరిగింది. కొన్ని విబేధాల కారణంగా తాను ఈ ప్రాజెక్టులో కొనసాగాలని అనుకోవడం లేదన్నారు. ఆచార్య మూవీ టీంకు ఆల్ ద బెస్ట్ చెప్పిన త్రిష… మరో మంచి ప్రాజెక్ట్‌తో తెలుగు ఆడియన్స్‌ను అలరిస్తానని తెలిపారు.

కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ‘ఆచార్య’ మూవీలో ముందుగా త్రిషకు ఫుల్ లెంత్ రోల్ ఇచ్చారట. అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తుండడం.. తనకు జోడీగా మరో హీరోయిన్ అవసరం కావడంతో.. త్రిష క్యారెక్టర్‌ను మూడు నాలుగు సీన్లకు పరిమితం చేయాల్సి వస్తుందట. ఈ విషయాన్నే డైరెక్టర్ కొరటాల శివ త్రిషకు తెలపడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటానని చెప్పిందట. ఈ విషయాన్నే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.


tags : Trisha Krishnan, Megastar Chiranjeevi, Koratala Shiva, Acharya, Chiru Acharya

Next Story