శృంగార తార సొంత ఓటీటీ.. కూతురునే హీరోయిన్ గా పెట్టి..

by  |
shakeela ott news
X

దిశ, వెబ్‌డెస్క్: షకీలా.. ఈ పేరు తెలియని సినిమా అభిమాని ఉండడు. స్టార్ హీరోలతో సమానంగా.. కాదు కాదు కొన్నిసార్లు స్టార్ హీరోలకంటే ఎక్కువగా క్రేజ్ సంపాదించుకున్న నటి అంటే అతిశయోక్తి కాదు. శృంగార తారగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న షకీలా డిజిటల్ ఎంట్రీకి సిద్ధమవుతోంది. ఎన్నో అవమానాలను, కష్టాలను ఎదుర్కొన్న ఈ భామ సొంతంగా ఓటీటీ ప్లాట్‌ఫాం ద్వారా తన చిత్రాలతో పాటు ఇతర సినిమాలను రిలీజ్‌ చేసేందుకు సన్నద్ధం అయ్యింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నా సినిమాలను విడుదల చేయడానికి సెన్సార్ వాళ్లు అభ్యంతరం తెలిపారు.. గతంలో జరిగిన ఘటనలా మళ్లీ జరగకూడదని నేనే స్వయంగా ఓటీటీ ప్లాట్‌ఫాం ను రిలీజ్ చేస్తున్నాను. నా కుమార్తెను ఈ ఓటీటీ ద్వారా హీరోయిన్ గా పరిచయం చేస్తున్నా.. ఇటీవలే డైరెక్టర్‌ రమేష్ కావలి చెప్పిన స్క్రిప్ట్‌ తనకు బాగా నచ్చాయని, గోవాలో అద్భుతమైన లొకేషన్లలో షూటింగ్‌ చేస్తున్నట్లు” తెలిపారు. అంతేకాకుండా కుమార్తె నటించే రెండు సినిమాలలోనూ తాను కూడా నటిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు పెళ్లిచేసుకొని షకీలా ఒక ట్రాన్స్ జెండర్ ని దత్తత తీసుకొని కూతురిలా పెంచుతున్న విషయం తెలిసిందే.

Next Story

Most Viewed