- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రముఖ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ అరెస్ట్..
<p>దిశ, వెబ్‌డెస్క్ : తమిళ యువ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ మీరా మిథున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలో సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం.. ఓ కులాన్ని కించపరిచేలా మాట్లాడి, ఆ వీడియోను పోస్ట్ చేసినందుకుగానూ హీరోయిన్ మీరా మిథున్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే బిగ్ బాస్, తమిళ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న మీరా మిథున్.. దళితులను కించపరిచేలా ఇటీవల పలు వ్యాఖ్యలు చేశారు. […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : తమిళ యువ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ మీరా మిథున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలో సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం.. ఓ కులాన్ని కించపరిచేలా మాట్లాడి, ఆ వీడియోను పోస్ట్ చేసినందుకుగానూ హీరోయిన్ మీరా మిథున్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
అయితే బిగ్ బాస్, తమిళ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న మీరా మిథున్.. దళితులను కించపరిచేలా ఇటీవల పలు వ్యాఖ్యలు చేశారు. అవి కాస్త వివాదస్పదమై, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో ఆమెపై సెక్షన్7 ప్రకారం పరువుకు నష్టం కలిగించేలా వీడియోను పోస్ట్ చేసినందుకు ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే.. మీరామిథున్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. తన అరెస్ట్ కలలోనే సాధ్యమని వ్యాఖ్యానించింది. సాధ్యమైతే తనను నిర్భయంగా అరెస్ట్ చేసుకోవచ్చని ఛాలెంజ్ చేసింది. తనను అరెస్ట్ చేయడం జరిగే పని కాదని.. ఒకవేళ అది జరిగినా కలలోనే సాధ్యమని పేర్కొంది. ఈ క్రమంలోనే శనివారం పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడం విశేషం.
#MeeraMithun should regret for her words against dalits. #MeeraMitunArrest pic.twitter.com/qnllxbNPok
— Advocate Dikshitha (@Advdikshi) August 14, 2021






