కాషాయం కండువా కప్పుకున్న మరో నటుడు

by Shamantha N |

<p>కోల్‌కతా : పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీలోకి చేరికలు పెరుగుతున్నాయి. బుధవారం బెంగాలీ నటుడు యష్ దాస్‌గుప్తా, ఇతర నటులతో కలసి కాషాయ కండువా కప్పుకున్నారు. కోల్‌కతాలో జరిగిన పార్టీ కార్యక్రమంలో యష్‌తోపాటు ఇతర నటులను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ, ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ కాషాయ పార్టీలోకి ఆహ్వానించారు. ‘యువతకు బీజేపీ ఎప్పుడు అవకాశాలు కల్పిస్తుంది. సమాజంలో మార్పు కోసం పనిచేయాల్సిన అవసరం మాపై ఉంది. సీఎం మమతా బెనర్జీ అంటే [&hellip;]</p>

కాషాయం కండువా కప్పుకున్న మరో నటుడు
X

కోల్‌కతా : పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీలోకి చేరికలు పెరుగుతున్నాయి. బుధవారం బెంగాలీ నటుడు యష్ దాస్‌గుప్తా, ఇతర నటులతో కలసి కాషాయ కండువా కప్పుకున్నారు. కోల్‌కతాలో జరిగిన పార్టీ కార్యక్రమంలో యష్‌తోపాటు ఇతర నటులను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ, ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ కాషాయ పార్టీలోకి ఆహ్వానించారు.

‘యువతకు బీజేపీ ఎప్పుడు అవకాశాలు కల్పిస్తుంది. సమాజంలో మార్పు కోసం పనిచేయాల్సిన అవసరం మాపై ఉంది. సీఎం మమతా బెనర్జీ అంటే నాకు గౌరవం. కానీ, నేను బీజేపీలో చేరాలనుకుంటున్నాను. రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాలని అనుకుంటున్నాను’ అని యష్ దాస్‌గుప్తా పేర్కొన్నారు.

Next Story