‘మా’లో.. లోకల్ నాన్ లోకల్ రచ్చ.. నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు

161

దిశ, వెబ్‌డెస్క్ : సినీ ‘మా’లో జరగబోయే ఎన్నికలకు సంబంధించి గత కొద్దిరోజులుగా వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈసారి తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్వహించే ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్, మరోవైపు మంచు ఫ్యామిలీ నుంచి మంచు విష్ణు ప్యానెల్ ప్రధాన పోటీదారులుగా నిలిచారు. అయితే, ప్రకాశ్ రాజ్‌కు మెగా కుటుంబం సపోర్టు లభించినట్టు తెలుస్తోండగా.. విష్ణు ప్యానెల్‌కు నందమూరి బాలకృష్ణ తెరవెనుక నుంచి నడిపిస్తున్నట్టు సినీవర్గాల టాక్. ఈ క్రమంలోనే ప్రస్తుత మా అధ్యక్షులు నరేష్‌ను ప్రకాశ్ రాజ్ ప్యానెల్ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో కొత్త నినాదం తెరమీదకు వచ్చింది.

‘లోకల్ నాన్ లోకల్’ అంశం గురించి జోరుగా చర్చ నడుస్తుండగా దీనిపై నటుడు సుమన్ స్పందించారు. లోకల్ నాన్ లోకల్ అనేది ప్రపంచానికే చేటు చేస్తుందన్నారు. భారతీయులు దేశవిదేశాలకు వెళ్ళి బతుకుతున్నారు. అలాగే దేశంలో ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి పనిచేసుకుని జీవిస్తున్నారు. అలాంటిది విదేశాల్లో లోకల్ నాన్ లోకల్ అని ఫాలో అయితే నష్టపోయేది మనమే కదా.? అని అన్నారు. కావున, భారతీయులంతా లోకల్ అని.. కశ్మీర్ వాళ్లు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి వెళ్లి బతకొచ్చన్నారు. అయితే, మా..లో ఈ నినాదం ఎందుకు తెరమీదకు వచ్చిందంటే ఈసారి మా అధ్యక్షుడిగా పోటీచేస్తున్న ప్రకాశ్ రాజ్ తెలుగు రాష్ట్రాలకు చెందినవాడు కాకపోవడమే.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..