రవితేజ 'క్రాక్'లో కటారి

by  |
రవితేజ క్రాక్లో కటారి
X

మాస్ మహారాజా రవితేజ. కష్టాన్నే నమ్ముకుని స్టార్‌గా ఎదిగిన టాలీవుడ్ హీరో. ‘‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు, మహాపురుషులవుతారు అన్న’’ ఎన్టీఆర్ సినిమాలో పాటలాగా..రవితేజ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మొదలై అసిస్టెంట్ డైరెక్టర్‌గా, ఆ తర్వాత హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకుతున్నారు. మూవీ హిట్టైనా, ఫ్లాపైనా అదే ఎనర్జీతో మరో కొత్త సినిమా చేసేందుకు ముందుకు వెళ్తుంటారు. ఇటీవల ఆయన హీరోగా వచ్చిన ‘డిస్కో రాజా’ మిశ్రమ ఫలితం వచ్చినా, ప్రేక్షకులు ఆదరించారు. రవితేజ ప్రస్తుతం గోపిచంద్ మలినేని డైరెక్షన్‌లో ‘క్రాక్’ చిత్రంలో నటిస్తున్నారు. రవితేజ సరసన శృతి హాసన్ నటిస్తుండగా, సీనియర్ తమిళ నటుడు సముద్రఖని ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా కటారి పాత్ర పోషిస్తున్న సముద్రఖని లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. లుక్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. గతంలో రవితేజతో ”డాన్‌ శీను, బలుపు” లాంటి సూపర్‌ హిట్ సినిమాలను తెరకెక్కించిన గోపీచంద్ మ‌లినేని.. మరో హిట్ సినిమా లైన్‌లో పెట్టానని ఈ మూవీ టైటిల్ పోస్టర్ ద్వారానే హింట్ ఇచ్చేశారు.

సముద్రఖనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ క్రాక్ సినిమాలో ఆయన క్యారెక్టర్ పేరు ‘కటారి’ అని తెలిపారు.ఈ పోస్టర్ చూస్తే ‘క్రాక్’లో రవితేజతో పోటీపడి ఆయన నటిస్తున్నాడని స్పష్టమవుతోంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన వరలక్ష్మి శరత్ కుమార్ లుక్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. జయమ్మగా ఆమె అదరగొట్టేయనుంది. మొత్తానికైతే పోస్టర్స్ తోనే సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తోంది క్రాక్ టీమ్.

తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందిస్తున్నారని తెలిసింది. సరస్వతి ఫిలిం డివిజన్‌ బ్యానర్‌లో బి. మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ మే 8వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ లాక్ డౌన్ నేపథ్యంలో అప్పుడు విడుదల అవుతుందో లేదో చూడాలి.

Tags: Hero ravi teja, movie krack, actor samuthirakani, role, katari, look, released


Next Story

Most Viewed