- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రజనీకాంత్ పార్టీలో చేరుతా : లారెన్స్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలుగు, తమిళ సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించే రాఘవ లారెన్స్, సినిమాలే కాకుండా ఆపదలో ఉన్న వారికి సేవ చేయడంలో ఎప్పుడూ ముందే ఉంటాడు. బయట విషయాలకు దూరంగా ఉంటూ, తన పనేదో తాను చేసుకుంటూ పోయే లారెన్స్ ఒక్కసారిగా తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారారు. ఈ క్రమంలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ప్రకటన తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది. ‘చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు, తమిళ సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించే రాఘవ లారెన్స్, సినిమాలే కాకుండా ఆపదలో ఉన్న వారికి సేవ చేయడంలో ఎప్పుడూ ముందే ఉంటాడు. బయట విషయాలకు దూరంగా ఉంటూ, తన పనేదో తాను చేసుకుంటూ పోయే లారెన్స్ ఒక్కసారిగా తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారారు.
ఈ క్రమంలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ప్రకటన తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది. ‘చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సహాయం చేస్తున్నానని, రాజకీయాల్లోకి వచ్చినా అంతే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని’ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేగాకుండా ఆయన రజినీకాంత్ పార్టీలో చేరుతానని స్పష్టం చేశారు.
Next Story






