ఆర్.నారాయణ మూర్తి సంచలన నిర్ణయం

by  |
ఆర్.నారాయణ మూర్తి సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: పేదల కష్టాలు, రైతుల బాధలు, పీడిత వర్గాల ఆర్తనాదలే లక్ష్యంగా పీపుల్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి సినిమాలు తీస్తుంటాడు. ఆదాయంతో సంబంధం లేకుండా, పేదల బాధలను సినిమా రూపంలో తీసే ఏకైక మానవీయ వ్యక్తి నారాయణ మూర్తి. ఇలాంటి వ్యక్తి గతకొంత కాలంగా సినిమాలపై ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకుండా సైలెంట్‌గా ఉన్నాడు. ఈ క్రమంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల ఆయన సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్‘ సినిమాలో నారాయణ మూర్తి ప్రస్తావన తీసుకురావడంతో ఆయన మళ్లీ తెరపై కనిపించారు. ఈ నేపథ్యంలో తాజాగా నారాయణ మూర్తి మరో సంచలన సినిమా ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఉద్యమం రైతు బంద్‌పై సినిమా చేస్తున్నట్టు వెల్లడించారు.

అంతేగాకుండా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ.. కేంద్ర వ్యవసాయ చట్టాలు రైతులకు శాపాలుగా మారాయని అన్నాడు. పంజాబ్,ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ మొదలగు రాష్ట్రాల నుంచి ఢిల్లీలో పెద్ద ఉద్యమం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ మూడు చట్టాలను తీసుకు రావడం వల్ల దేశంలో వున్న వ్యవసాయం అంత కార్పొరేట్ మయం అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులపై దయవుంచి వెంటనే ఆ చట్టాలను రద్దు చేయండి అంటూ చేతులెత్తి వేడుకున్నాడు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం వ్యవసాయ చట్టాలను రద్దు చేసి రాష్ట్రాలకు అధికారాలు ఇచ్చి స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని అని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed