పవన్ కల్యాణ్ గొప్పదనం అందరికీ తెలుసు

by  |
పవన్ కల్యాణ్ గొప్పదనం అందరికీ తెలుసు
X

దిశ, వెబ్ డెస్క్: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాతి కథ అంటూ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సినిమా తీసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాపై ఆగ్రహించిన పవన్ అభిమానులు ‘పరాన్న జీవి’ పేరుతో రామ్ గోపాల్ వర్మపై సినిమా తీస్తున్న విషయం కూడా ఇప్పటికే మనం చూశాం. తాజాగా ‘పవర్ స్టార్’ సినిమాపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

పవన్ కల్యాణ్ గొప్పదనం ఏమిటో అందరికీ తెలుసని, రామ్ గోపాల్ వర్మ తప్పుగా చూపించినంత మాత్రాన పవన్‌ కళ్యాణ్‌కు పోయేదేమీ లేదని ప్రకాశ్ రాజ్ చెప్పారు. పవన్ రేంజ్ చాలా ఎక్కువ అని అన్నారు. వర్మను అలా వదిలేయడమే మంచిదని అన్నారు. వర్మ తన లిమిట్స్‌లో ఉంటాడని ఆశిస్తున్నానని చెప్పారు. అంతేగాకుండా రామ్ గోపాల్ వర్మ చాలా తెలివిగల విజ్ఞాతవంతుడని అన్నారు. వర్మ అందరిలాంటి వ్యక్తి కాదని, ఆయన ఒక విచిత్రమైన వ్యక్తిత్వం గల వ్యక్తి అన్నారు. ఆయన ఏ సినిమా తీసినా చూడాలని ఎవరినీ బలవంత పెట్టడని అన్నారు. ఆయన సినిమాలు మనకు నచ్చితేనే చూడాలని, లేకపోతే వదిలేయాలని చెప్పారు.

Next Story

Most Viewed