సమానత్వానికి మరో 30 ఏళ్లు పట్టొచ్చు : నందితాదాస్

by  |
సమానత్వానికి మరో 30 ఏళ్లు పట్టొచ్చు : నందితాదాస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం రావడానికి మరో 20 నుంచి 30 ఏళ్లు పట్టొచ్చని, అప్పటివరకు వివక్ష కొనసాగుతూనే ఉంటుందని సినీ నటి నందితా దాస్ అభిప్రాయపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ సమావేశంలో ఆమె మాట్లాడారు. వలస కూలీల్లోనూ వివక్ష ఉందని, వారంతా సమాజానికి అతిథి కార్మికులుగా వర్ణించారు. నగరాల్లో పని చేస్తోన్న వలస కూలీల పట్ల ఎలాంటి జాగ్రత్త తీసుకోవడం లేదన్నారు.

పైగా వారి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుందంటూ అపవాదును ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభంలో గృహహింస పెరిగిందని చెప్పారు. ఈ కల్చర్ ప్రపంచ వ్యాప్తంగా ఉందన్నారు. వర్క్ ఫ్రం హోం కూడా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించిందని వివరించారు. ప్రతీ మహిళ ఇతర నగరాలకు ప్రయాణం చేయాలని ఆశిస్తుందన్నారు. తాను కూడా విరాటపర్వం సమయంలో హైదరాబాద్‌కు వచ్చినట్లు చెప్పారు. ఇక్కడి ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉంటారని, అలాగే హైదరాబాద్ ఫుడ్ కూడా చాలా బాగుంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ మన్నె ఉషారాణి కూడా ప్రసంగించారు.


Next Story

Most Viewed