భార్య దుస్తులు ధరించిన నటుడు.. లింగ సమానత్వంపై పోస్ట్

by  |
Actor-Nakkhul
X

దిశ, సినిమా : ప్రైడ్ మంత్ జూన్‌లో జెండర్ న్యూట్రల్‌పై అవేర్‌నెస్ కల్పించేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంధ సంస్థలు పనిచేస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో తమిళ్ యాక్టర్ నకుల్ చేసిన పోస్ట్ నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నకుల్.. లాక్ డౌన్ టైమ్‌లో భార్య శ్రుతి, కూతురు అకీరాతో కలిసి సాంగ్స్ పాడుతూ నెటిజన్లను కూల్ చేస్తుండేవారు. సామాజిక సమస్యలపై కూడా స్పందించే నటుడు.. కేవలం తల్లీకూతురుకు మాత్రమేనా మ్యాచింగ్ తాను కూడా బిడ్డకు మ్యాచింగ్ డ్రెస్ వేసుకుంటానని, భార్య డ్రెస్ ధరించి తన చిన్నారి‌తో ట్విన్నింగ్ పిక్చర్ షేర్ చేశాడు.

‘ మీ బట్టలను ధరించేందుకు, రాక్ చేసేందుకు ఎలాంటి అహంభావం లేని వ్యక్తికి ఇది సౌకర్యవంతమైనది. అకీరాతో నాకు మాత్రమే ట్విన్నింగ్ డ్రెస్‌లు లభిస్తాయనే కోపంతో నకుల్ నా డ్రెస్‌ వేసుకుని జెండర్ న్యూట్రల్‌‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు’ అని నకుల్ భార్య శ్రుతి ఇన్‌స్టా్గ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. కాగా లేడీస్ కుర్తా ధరించిన నకుల్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Next Story