‘మా’ వివాదం.. నటుడు శివ బాలాజీని కొరికిన హేమ.. నిమ్స్‌లో చికిత్స

by  |
‘మా’ వివాదం.. నటుడు శివ బాలాజీని కొరికిన హేమ.. నిమ్స్‌లో చికిత్స
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు చిత్రపరిశ్రమలో మా ఎన్నికలు తొలిసారి వివాదాస్పదంగా మారాయి. ఒక ప్యానెల్ సభ్యులు మరో ప్యానెల్‌పై దాడులు చేసుకునే వరకు వెళ్లారు. ఉదయం పోలింగ్ బూత్‌లో ప్రకాశ్ రాజ్ టీం సభ్యులు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని హీరో మంచు ప్యానెల్ సభ్యులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఇరు ప్యానెల్ సభ్యులు వాగ్వివాదానికి దిగారు.

ఈ క్రమంలోనే ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యురాలు నటి హేమ మంచు విష్ణు ప్యానెల్ సభ్యుడు నటుడు శివబాలాజీ చెయ్యి కొరికినట్టు తెలుస్తోంది. గాయం ఎక్కువగా కావడంతో శివబాలాజీ నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ముందస్తుగా టీటీ ఇంజెక్షన్ తీసుకున్నట్టు బాలాజీ ప్రకటించారు.



Next Story

Most Viewed