- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త ఇళ్లు కడుతున్న హీరో ధనుష్.. ఖర్చు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
<p>దిశ, సినిమా : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో కొత్త ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో జరిగిన ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా హాజరు కాగా.. ధనుష్ నిర్మిస్తున్న ఇల్లు ఆయన ఇంటికి దగ్గరలోనే ఉండనుంది. ఈ ఫోర్ స్టోరీడ్ బిల్టింగ్ కోసం ధనుష్ రూ.150 కోట్లు ఖర్చు చేయనున్నాడని సమాచారం. ప్రస్తుతానికి నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్ ‘ది గ్రే మ్యాన్’ షూటింగ్ నిమిత్తం యూఎస్‌లో […]</p>

దిశ, సినిమా : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో కొత్త ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో జరిగిన ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా హాజరు కాగా.. ధనుష్ నిర్మిస్తున్న ఇల్లు ఆయన ఇంటికి దగ్గరలోనే ఉండనుంది. ఈ ఫోర్ స్టోరీడ్ బిల్టింగ్ కోసం ధనుష్ రూ.150 కోట్లు ఖర్చు చేయనున్నాడని సమాచారం. ప్రస్తుతానికి నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్ ‘ది గ్రే మ్యాన్’ షూటింగ్ నిమిత్తం యూఎస్‌లో ఉన్న ధనుష్.. తిరిగిరాగానే ఫిల్మ్ మేకర్ కార్తిక్ నరేన్ రూపొందించనున్న మూవీ షూటింగ్‌తో బిజీ కానున్నాడు. ఇటీవలే ‘జగమే తంత్రం’లో కనిపించిన ఈ వీఐపీ స్టార్.. త్వరలోనే తెలుగు డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో ట్రై లింగువల్ ఫిల్మ్ అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమా ఆగస్టు నుంచి సెట్స్‌పైకి వెళ్లే చాన్స్ ఉండగా.. ధనుష్‌కు జోడీగా హీరోయిన్ సాయిపల్లవి నటించనుంది.






