- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రముఖ నటి చిత్ర ఇకలేదు..అతనే కారణమా?
<p>దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ తమిళ నటి చిత్ర అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ హోటల్‌లో మంగళవారం రాత్రి ఆమె మరణించినట్లు తెలుస్తోంది.చిత్ర పలు సినిమాలు, సీరియల్స్ లో నటించింది.ఇటీవలె ఆమెకు చెన్నైలోని హేమంత్‌తో కుటుంబసభ్యులు వివాహం నిశ్చయించారు. ఈ క్రమంలోనే నటి అనుమానాస్పద స్థితిలో మరణించడంతో సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, చిత్ర చనిపోయిన సమయంలో హేమంత్ ఆమెతో పాటు హోటల్లో ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ తమిళ నటి చిత్ర అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ హోటల్‌లో మంగళవారం రాత్రి ఆమె మరణించినట్లు తెలుస్తోంది.చిత్ర పలు సినిమాలు, సీరియల్స్ లో నటించింది.ఇటీవలె ఆమెకు చెన్నైలోని హేమంత్‌తో కుటుంబసభ్యులు వివాహం నిశ్చయించారు. ఈ క్రమంలోనే నటి అనుమానాస్పద స్థితిలో మరణించడంతో సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే, చిత్ర చనిపోయిన సమయంలో హేమంత్ ఆమెతో పాటు హోటల్లో ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని హేమంత్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. తనను బయటకు పంపించి చిత్ర ఇలా దారుణానికి ఒడిగట్టిందని విచారణలో భాగంగా చెప్పినట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.






