అమ్మవారిని దర్శించుకున్న అల్లరి నరేష్‌..

136

దిశ, ఏపీ బ్యూరో: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్మమ్మవారిని సినీ నటుడు అల్లరి నరేష్‌ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన నరేష్‌ దంపతులకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న నరేష్‌ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దంపతులకు వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదం, శేష వ్రస్తాలు బహూకరించారు. ఇకపోతే ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగా రెండు చిత్రాల్లో నటిస్తుండగా.. మంచు మనోజ్ నటిస్తున్న ‘అహం బ్రహ్మాస్మి’ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..