- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలి
<p>దిశ,సిద్దిపేట: కలెక్టర్ వెంకట్ రాంరెడ్డిపై చర్యలు తీసుకోవాలని పీసీసీ జనరల్ బక్క జడ్సన్ డిమాండ్ చేశారు. గత నెలలో ఆత్మహత్య చేసుకుని మరణించిన దళిత రైతు బ్యాగరీ నర్సిములు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత నెలలో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన దళిత రైతు నర్సిములు భూమిని ప్రభుత్వం అక్రమంగా లాక్కుందన్నారు. […]</p>

దిశ,సిద్దిపేట: కలెక్టర్ వెంకట్ రాంరెడ్డిపై చర్యలు తీసుకోవాలని పీసీసీ జనరల్ బక్క జడ్సన్ డిమాండ్ చేశారు. గత నెలలో ఆత్మహత్య చేసుకుని మరణించిన దళిత రైతు బ్యాగరీ నర్సిములు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత నెలలో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన దళిత రైతు నర్సిములు భూమిని ప్రభుత్వం అక్రమంగా లాక్కుందన్నారు. దీంతో మనస్తాపానికి గురై ఆ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్న కలెక్టర్ వెంకట్ రాంరెడ్డిని విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొట్టమొదట కలెక్టర్ పై చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు.






