మెగాస్టార్ ‘ఆచార్య’ అప్ డేట్

by  |
మెగాస్టార్ ‘ఆచార్య’ అప్ డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా అప్ డేట్ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న మూవీ ఆచార్య. కాగా ఈ సినిమా టీజర్ కోసం వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్‌కు డైరెక్టర్ కొరటాల శివ హ్యాపీ న్యూస్ చెప్పారు. ఈ నెల 29 సా. 4:05 గంటలకు టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆచార్య షూటింగ్ త్వరగా కంప్లీట్ అయ్యేందుకు సహకరిస్తున్న మూవీ యూనిట్‌కు స్పెషల్ వీడియో ద్వారా థాంక్స్ చెప్పిన కొరటాల.. చిరు తన కెరియర్‌లోనే బెస్ట్ సినిమా చేస్తున్నారని తెలిపారు. త్వరలో ధర్మస్థలి డోర్స్ తెరుచుకుంటాయంటూ..టీజర్ రిలీజ్ గురించి అప్ డేట్ ఇచ్చారు.

కాగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో చెర్రీ సిద్ధగా కనిపించబోతుండగా.. కాజల్ అగర్వాల్ చిరుకు జోడిగా సెలెక్ట్ అయింది. ఇక చెర్రీకి జంటగా పూజా హెగ్డే నటిస్తుందని వార్తలు వస్తుండగా.. దీనిపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. సమ్మర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది మూవీ యూనిట్.


Next Story