రూబీ గోల్డ్ స్కాం..1000కేజీల బంగారం దోచిన వ్యక్తి అరెస్టు

65

దిశ, వెబ్‌డెస్క్ : వడ్డీలేని రుణాలు ఇప్పిస్తానని చెప్పి భారీ ఎత్తున బంగారంతో ఉడాయించిన నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకివెళితే.. తమిళనాడు రాజధాని చెన్నైలో రూబీ ఫైనాన్స్ పేరిట ఇఫ్సర్ రెహ్మాన్ వడ్డీలేని రుణాలు ఇప్పిస్తానని కస్టమర్లకు మాయమాటలు చెప్పాడు. సుమారు 1500 మంది నుంచి 1000కేజీలకు పైగా బంగారు అభరణాలను సేకరించాడు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా గోల్డ్ మొత్తంతో ఉడాయించాడు.

దీంతో మోసపోయామని భావించిన బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. 2019 నుంచి పరారీలో ఉన్న నిందితుని కోసం గాలింపు చర్యలు కొనసాగుతుండగా ఎట్టకేలకు హైదరాబాద్‌ మహానగరం BHELలోని ఓ ఇంట్లో నిందితుడు ఇఫ్సర్ రెహ్మాన్‌, అతని సోదరుడు అనీస్, మరో ముగ్గురు మహిళలను అరెస్టు చేశారు. అనంతరం వీరిని రిమాండ్ కు తరలించగా.. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..