- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్: మంత్రి హరీశ్ కారుకు ప్రమాదం
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో వాహనం భారీగా ధ్వంసం అవ్వగా.. హరీశ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. హరీశ్‌కు ప్రమాదం తప్పడంతో టీఆర్‌ఎస్ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఆదివారం సిద్దిపేట పర్యటన పూర్తి చేసుకుని సిద్దిపేట నుంచి హైదరాబాద్‌కు హరీశ్ తిరిగి వేస్తున్న క్రమంలో దుద్దెడ సమీపంలో అడవి పంది అడ్డుగా వచ్చింది. దీంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో హరీశ్ రావు కారు కాన్వాయ్‌లోని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో వాహనం భారీగా ధ్వంసం అవ్వగా.. హరీశ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. హరీశ్‌కు ప్రమాదం తప్పడంతో టీఆర్‌ఎస్ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఆదివారం సిద్దిపేట పర్యటన పూర్తి చేసుకుని సిద్దిపేట నుంచి హైదరాబాద్‌కు హరీశ్ తిరిగి వేస్తున్న క్రమంలో దుద్దెడ సమీపంలో అడవి పంది అడ్డుగా వచ్చింది. దీంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో హరీశ్ రావు కారు కాన్వాయ్‌లోని మరో వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్, గన్‌మెన్‌కు గాయాలయ్యాయి. దీంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మంత్రి హరీశ్ రావు క్షేమంగా బయటపడగా.. మరో కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు.
Next Story






