ఔటర్ రింగ్ రోడ్డులో ప్రమాదం.. మానవత్వం చాటుకున్న ఎంపీ కోమటిరెడ్డి (వీడియో)

by Shyam |   (  Updated:2025-08-26 18:22:48  IST  )

<p>దిశ, వనస్థలిపురం : పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బైకును కారు ఢీకొనడంతో చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఈ సందర్భంగా అటుగా వెళ్తున్న కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. వెంటనే 108 వాహనాన్ని ప్రమాద స్థలానికి రప్పించి ప్రథమ చికిత్స కోసం హయత్ నగర్ అమ్మ ఆసుపత్రికి అంబులెన్స్‌లో వారిని పంపించారు. గాయపడ్డ వ్యక్తికి, అతని కూతురికి ప్రత్యేక […]</p>

ఔటర్ రింగ్ రోడ్డులో ప్రమాదం.. మానవత్వం చాటుకున్న ఎంపీ కోమటిరెడ్డి (వీడియో)
X

దిశ, వనస్థలిపురం : పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బైకును కారు ఢీకొనడంతో చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఈ సందర్భంగా అటుగా వెళ్తున్న కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు.

వెంటనే 108 వాహనాన్ని ప్రమాద స్థలానికి రప్పించి ప్రథమ చికిత్స కోసం హయత్ నగర్ అమ్మ ఆసుపత్రికి అంబులెన్స్‌లో వారిని పంపించారు. గాయపడ్డ వ్యక్తికి, అతని కూతురికి ప్రత్యేక చికిత్స అందించాలని ఆసుపత్రి యాజమాన్యంతో కోమటిరెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. అయితే అంతకు ముందు గాయాలతో అల్లాడిపోతున్న చిన్న పాపను ఎత్తుకొని ఆయన ఓదార్చారు. చిన్నారి నుదిటిపై రక్తాన్ని గుడ్డతో తుడిచి వారిని పేరెంట్స్‌కి ధైర్యం చెప్పారు.

Click For Video..

Next Story